ఉట్కూర్ మండల కేంద్రంలోని అజాద్ నగర్ లో నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని గురువారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. కమ్యూనిటీ భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.