నర్వ మండలంలోని కోయిల్ సాగర్ ఫేస్ 1 సంప్ హౌస్ ను సోమవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరిశీలించారు. సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంప్ హౌస్ మరమ్మత్తులు ఎంత మేరకు నిధులు అవసరమవుతాయని అడిగి తెలుసుకున్నారు. మరమ్మత్తుల కొరకు నిధులు విడుదల చేయాలని ఉన్నత అధికారులకు సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.