నారాయణ పేట జిల్లా నర్వ మండల కేంద్రంలో శనివారం "సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్" నినాదంతో హిందూ సంఘాలు రోడ్డెక్కాయి. రిజర్వేషన్లపై బంగ్లాదేశ్ లో చెలరేగిన అల్లర్లు మతం రంగు పులుముకుని మైనార్టీలో ఉన్న హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని, హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు అన్ని ఏకమై ర్యాలీ నిర్వహించారు.