ఉట్కూర్: శిధిలావస్థలో పశు వైద్యశాల

78చూసినవారు
ఉట్కూర్ మండలం బిజ్వర్ గ్రామంలోని పశు వైద్యశాల శిధిలావస్థకు చేరింది. పూర్తిగా కూలిపోయే పరిస్థితిలో వైద్యశాల వుండటంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. బిజ్వార్, కొత్తపల్లి, అవుసులోనిపల్లి, పెద్దజట్రం గ్రామాలకు చెందిన రైతులు అనారోగ్యంతో వున్న పశువులను ఇక్కడికి చికిత్సల కొరకు తీసుకొస్తారు. వైద్య శాలను పూర్తిగా తొలగించి నూతన ఆసుపత్రి నిర్మించాలని సామాజిక కార్యకర్త మహేష్ గౌడ్ కోరారు.

సంబంధిత పోస్ట్