గద్వాల: మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీనివాస్ రెడ్డి
మృతుల కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ మల్దకల్ మండల సీనియర్ నాయకులు బీజ్వార్ శ్రీనివాస్ రెడ్డి శనివారం పరామర్శించారు. గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని ఉలిగేపల్లి గ్రామానికి చెందిన మున్నూరు కాపు వెంకట్ రెడ్డి, కుర్వ కర్రెప్ప మృతి చెందిన విషయం తెలుసుకున్న జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సరిత ఆదేశానుసారం బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు వెళ్లి పరామర్శించారు.