కొల్లూరు గ్రామస్తులకు చట్టాలపై అవగాహన

82చూసినవారు
కొల్లూరు గ్రామస్తులకు చట్టాలపై అవగాహన
ఉట్కూర్ మండలం కొల్లూరు గ్రామ రైతు వేదికలో శనివారం జిల్లా న్యాయసేవాదికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించినట్లు పార లీగల్ వాలంటీర్ హాజమ్మ, ఏఈఓ నందిని తెలిపారు. న్యాయ వ్యవస్థలో రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని ప్రజలు వాటిపై అవగాహన కలిగి వుండాలని అన్నారు. భవన నిర్మాణ, ఇతర రంగంలో వున్న కార్మికులు లేబర్ కార్డు కలిగి వుండాలని చెప్పారు. వాలంటీర్ నారాయణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్