కరోన బాధిత పేదలకు నిత్యావసరాలు పంపిణీ

664చూసినవారు
కరోన బాధిత పేదలకు నిత్యావసరాలు పంపిణీ
బిజినపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా కరోనా బాధిత నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి పంపిన నిత్యావసర సరుకులను ఆ గ్రామ ఎంపీటీసీ మంగి విజయ్ పంపిణీ చేశారు. కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న వారిని గ్రామంలో ముందుగా గుర్తించి వాళ్లకు ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి ఇంటికి వెళ్లి బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అందించారు. అంతేకాక కరోన పట్ల ఎలాంటి భయబ్రాంతులకు గురి కావలసిన అవసరం లేదని, మనోధైర్యమే పెద్ద విరుగుడని వివరించారు. ఈ కార్యక్రమంలో బిజినేపల్లి మాజీ ఉప సర్పంచ్ పరుషరాములు, మండల మైనారిటీ నాయకులు గఫూర్, టౌన్ యూత్ అధ్యక్షులు శివ తదితరులు పాల్గొన్నారు..

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్