లింగాల మండలం అంబటిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు రాష్ట్రస్థాయి కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్‌లో బంగారు, వెండి పతకాలను సాధించి సత్తా చాటారు. దీంతో పలువురు మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని మహేశ్వరి తన ప్రావీణ్యాన్ని కనబరుచుతూ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.