కలెక్టర్ సిక్తా పట్నాయక్ విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అనుకోని అతిథిగా వచ్చి తమతో పాటు కింద కూర్చుని కలెక్టర్ భోజనం చేయడంతో ఆ విద్యార్థినుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దామరగిద్ద మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయాన్ని మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీకి వెళ్లిన సమయంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి సిద్ధం కావడంతో ఆహారం పరిశీలించేందుకు అక్కడే భోజనం చేశారు.