నియోజకవర్గంలో ప్రజలందరూ సోదరభావంతో కలిసిమెలసి సుఖసంతోషాలతో పండుగలు జరుపుకోవాలని, వాటిని రాజకీయ కోణంలో చూడొద్దని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ప్రజలను కోరారు. గురువారం నారాయణపేట సివిఆర్ భవన్ లో మాట్లాడుతూ. ప్రజలు శాంతి సౌమ్యులని, తరతరాలుగా నారాయణపేట పట్టణంలో శాంతి, సహనంతో పండుగలు జరుపుకొనే సంప్రదాయం కొనసాగుతుందని, అదే స్పూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.