ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి

73చూసినవారు
ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి
నారాయణపేట జిల్లా దామరగిద్ద పట్టణ కేంద్రంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల రుణాలు మాఫీ చేయాలని అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నర్సింలు అన్నారు. మంగళవారం దామరగిద్ద మండలం కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం బ్యాంకు మేనేజర్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న చిన్న కారణాలతో రైతుల రుణాలు మాఫీ చేయడం లేదని, ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్