మరికల్ మండలం కన్మనూర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. సోమవారం మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. రూ. 2 కోట్ల 70 లక్షల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సెప్టెంబర్ లో ఫిర్యాదు చేసిన నేటికీ చర్యలు తీసుకోలేదని అన్నారు.