శివలింగానికి మొక్కుతున్న వానరం.. ఫొటో వైరల్

592చూసినవారు
శివలింగానికి మొక్కుతున్న వానరం.. ఫొటో వైరల్
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలో రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగానికి ఓ వానరం మొక్కింది. సోమవారం స్వామి దర్శనానంతరం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు పూజలు చేసి అలంకరించారు. ఆ సమయంలో ఓ కోతి తన్మయత్వంతో శివలింగానికి మొక్కడం భక్తులను ఆకర్షించింది. పక్కనే కొబ్బరి చిప్పలున్నా కోతి చేష్టలు చేయకుండా దండంపెడుతున్న ఈ ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్