తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను నేడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా జిల్లాలోని దామరగిద్ద మండలం మొగల్ మడక గ్రామానికి చెందిన బాలు గౌడ్ నారాయణపేట జిల్లా స్థాయిలో SGT 21వ ర్యాంకు, SA 18వ ర్యాంకు, శివరాజ్ జిల్లాస్థాయిలో SA 64, SGT 39వ ర్యాంకును సాధించారు. గ్రామ ప్రజలందరూ వీరికి అభినందనలు తెలిపారు.