పోలీస్ వాహనాల డ్రైవర్లు డ్రైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా వుండాలని ఆర్ఎస్ఐ శివశంకర్ అన్నారు. మంగళవారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని పోలీస్ స్టేషన్ లలో పని చేస్తున్న పోలీస్ వాహనాల డ్రైవర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అధికారుల ఆదేశాల మేరకు రాత్రి సమయాల్లో కేటాయించిన పట్టణాల్లో, గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని అన్నారు. వాహనాలు కండిషన్ లో పెట్టాలని సూచించారు.