కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పని చేస్తోందని, నిరసనగా జనవరి 09 డిమాండ్ డేగా జరపాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ అన్నారు. శుక్రవారం నారాయణపేట భగత్ సింగ్ భవన్ లో నిర్వహించిన సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రం బడ్జెట్ లో వ్యవసాయ శాఖ అధిక నిధులు కేటాయించి రైతులు సంపన్నులయ్యారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.