కంటివెలుగు ను సద్వినియోగం చేసుకోవాలి

66చూసినవారు
కంటివెలుగు ను సద్వినియోగం చేసుకోవాలి
కంటివెలుగు శిబిరంలో ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకొని సద్వినియోగం చేసుకోవాలని వైద్యురాలు అయేష అన్నారు. ఖిల్లాఘణపురం మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామంలో కంటివెలుగు శిబిరాన్ని మంగళవారం ఆమె వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదటి రోజు గ్రామంలో 157మందికి కంటి పరీక్షలు నిర్వహించి నలుగు రికి రీడింగ్ గ్లాసెస్ అందజేసినట్లు తెలిపారు. అలాగే 42 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఐదుగురిని ఆపరేషనకు రెఫర్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈవో శ్రవణ్, ఏఎన్ఎంలు భాగ్యలక్ష్మి, సుమలత, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్