వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం జయన్న తిర్మలాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. కేంద్రంలోని రిజిస్టర్లు, స్టాక్ నిల్వలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి లక్ష్మిబాయి, వైద్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డా. సాయినాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.