వనపర్తి జిల్లా కలెక్టరేట్ దగ్గరున్న ఎక్సైజ్ కార్యాలయంలో మద్యం దరఖాస్తులకు శుక్రవారం చివరిరోజు అయినందున మద్యం షాపులకు టెండర్లు వేయడానికి వచ్చిన వారితో కార్యాలయం కిక్కిరిసి పోయింది. నిన్నటి వరకు ఆత్మకూరు ఎక్సైజ్ సర్కిల్‌లో 5 షాపులకు 82 దరఖాస్తులు వచ్చాయి. నేడు ఒకే రోజు 70 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలియజేశారు.