గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో హిందువులపై, హిందూ దేవాలయపై జరుగుతున్న దాడులకు నిరసనగా వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో ఈ నెల 16 న శుక్రవారం సంపూర్ణ బందుకు హిందూ ఐక్యవేదిక బజరంగ్ దళ్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని హిందూ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, యువకులు, మహిళలు విజయవంతం చేయాలని. స్వచ్ఛందంగా వ్యాపారస్తులు బంద్ చేసి హిందువులకు మద్దతుగా నిలవాలని హిందూ ఐక్యవేదిక సభ్యులు కోరారు.