గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే

69చూసినవారు
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం ముందరితండా గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు తండావాసులు బతుకమ్మతో, డీజే శబ్దాల మధ్య సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. ముందరితండా గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్