కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో రైతులు చేపట్టిన రైతు ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్ అన్నారు. సోమవారం అమరచింతలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కోశాధికారి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.