వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి గురువారం సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయనిధి పేద ప్రజలకు కొండంత ధైర్యాన్ని ఇస్తుందని, ఏ చిన్న ప్రథమ చికిత్స చేసుకున్న తక్షణమే సీఎం సహాయనిధి చెక్కులు ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.