వనపర్తి జిల్లా కేంద్రంలోని 28వ వార్డు వెంగళరావు నగర్ కాలనీలో గత కొంతకాలంగా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో నీటి ఎద్దడిని స్థానిక నాయకులు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే బోర్ వేయించారని, సమస్య పరిష్కారమైందని కాంగ్రెస్ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి శనివారం తెలిపారు. ఈ కార్యక్రంమలో చీర్ల చందర్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.