వనపర్తి జిల్లాలో ఆర్ముడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ రక్తపోటుతో శ్రీనివాసులు ఇటీవల మృతి చెందారు. బుధవారం కుటుంబానికి సహద్యోగులు లక్ష 16 వేల రూపాయలను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ద్వారా శ్రీనివాసులు కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఒకరిని కోల్పోయామని, వారికి అన్నివేళలా అండగా ఉంటామన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖలో పనిచేసే ఉద్యోగులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు.