ఆ పబ్‌లో 9 తరువాత గలీజ్ పనులు.. అదుపులోకి 160 మంది

54చూసినవారు
యువకులను ఆకర్షించడానికి అమ్మాయిలను తీసుకొచ్చి అసభ్యకరమైన డాన్సులు చేయిస్తున్న పబ్ పై పోలీసులు దాడులు చేశారు. బంజారాహిల్స్ కేబిఅర్ పార్క్ సమీపంలోని ఆఫ్టర్ 9 రెస్ట్రో పబ్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రైడ్ సమయంలో సుమారు 100 నుండి 160 మంది యువతి యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న 32 మంది యువతులు, 75 యువకులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్