'కల్తీ' అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా అరెస్ట్

571చూసినవారు
HYDలో 'కల్తీ' అల్లం, వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. తాజాగా HYD లాలాగూడ PS పరిధిలో వాల్ పెయింటింగ్స్ లో వాడే కెమికల్స్ కలిపి కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పక్కా సమాచారంతో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ స్థావరాలపై దాడులు నిర్వహించారు. 1.70 లక్షల విలువైన 1300 కిలోల అల్లం, వెల్లుల్లి పేస్ట్, 20 కేజీల టైటానియం డయాక్సైడ్ ను సీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్