రైలులో విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన (వీడియో)

71చూసినవారు
ఓ రైలులో ఆకతాయి రెచ్చిపోయాడు. వాష్‌రూమ్‌కి వెళ్లి వస్తున్న యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విజయవాడ నుంచి విశాఖ వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఈ ఘటన జరిగింది. గత అర్ధరాత్రి ఓ విద్యార్థిని రైలులో వాష్‌రూమ్‌కి వెళ్లింది. ఇదే క్రమంలో అక్కడ ఉన్న ఓ యువకుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే యువతి కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు అప్రమత్తమై ఆకతాయిని అడ్డుకున్నారు. అనంతరం రైల్వే పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు.

సంబంధిత పోస్ట్