మనం ఏ పని మీదైనా బయటకు వెళ్తే సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాం. వాస్తు ప్రకారం కొన్నింటిని పాటిస్తే మనం వెళ్లిన పనిలో కచ్చితంగా విజయం దక్కుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు నోటిలో కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవాలని అలా చేస్తే పాజిటివ్ ఎనర్జీతో పని సక్సెస్ అవుతుందంటున్నారు. అలాగే విఘ్నేశ్వరునికి నమస్కరించుకుని బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.