రైతులకు కేంద్రం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలో రైతుల కోసం మరో కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పశువుల ఆరోగ్యం కోసం CADCPని ప్రవేశపెడుతూ బుధవారం కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కోసం రూ.3880 కోట్లను కేటాయించింది. ఈ పథకం కింద పశువులకు వ్యాక్సిన్లు వేయడంతో పాటు, తక్కువ ధరకే వాటికి అవసరమైన మందులు అందించేందుకు పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.