తెలంగాణలో పెన్షన్ తీసుకునేవారికి శుభవార్త.. రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ సమయంలో వేలిముద్రలు పడకపోవడం సమస్యగా మారింది. మెషీన్లు వేలి ముద్రను గుర్తించకపోతే అందేది కాదు. దీంతో ఈ సమస్యకు చెక్ పెడుతూ సెర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది. మంచానికి పరిమితమై ఇల్లు వదిలి రాలేని వృద్ధులకు, వేలి ముద్ర పడని వారికి పంచాయతీ కార్యదర్శులు తమ వేలిముద్రను నమోదు చేసి, పింఛన్ డబ్బులు అందజేయాలని ఆదేశించింది.