ఏపీ రాష్ట్ర ప్రజలకు రైల్వేశాఖ తీపి కబురు చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. మహా కుంభమేళాకు జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో తిరుపతి-బెనారస్ (07107) ప్రత్యేక రైళ్లను విజయవాడ మీదుగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు నడపనున్నట్లు వెల్లడించింది. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ కోరింది.