ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి అనుగుణంగా 10-12 వేల మందిని నియమించుకుంటామని విప్రో సంస్థ ప్రకటించింది. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రూపంలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ తెలిపారు. సమీక్షా త్రైమాసికంలో కొత్తగా 337 మంది చేరడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,34,391కి చేరినట్లు విప్రో పేర్కొంది.