గూడ్స్‌ రైలు డ్రైవర్‌, అసిస్టెంట్‌ డ్రైవర్‌, గార్డు మృతి

1059చూసినవారు
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గూడ్స్‌ రైలు డ్రైవర్‌, అసిస్టెంట్‌ డ్రైవర్‌తో పాటు, కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ గార్డు మరణించారని రైల్వే బోర్డు చైర్మన్‌, సీఈవో జయ వర్మ సిన్హా వెల్లడించారు. కాగా, అస్సాంలోని సిల్చార్‌ నుంచి కోల్‌కతాలోని సెల్దాకు బయల్దేరిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ రైలును అదే ట్రాక్‌పై వెనుకనుంచి వచ్చిన ఓ గూడ్స్‌ రైలు బలంగా ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 30 మంది చనిపోగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

సంబంధిత పోస్ట్