ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూములను గుర్తించాలి: మంత్రి డోలా

74చూసినవారు
ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూములను గుర్తించాలి: మంత్రి డోలా
AP: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వ భూములను గుర్తించాలని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. కొండపి రెవెన్యూ అధికారులతో శుక్రవారం ఆయన సమావేం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భూమి పునః సర్వే నిర్వహించాలని అన్నారు. కొండపిలోని ఫ్రీహోల్డ్ భూముల్లో అక్రమాలను గుర్తించాలని ఆయన అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్