ఉమెన్ ఆఫ్ ది ఇయర్-2025 జాబితాను టైమ్స్ మ్యాగజైన్ గురువారం ప్రకటించింది. 13 మందితో ప్రకటించిన ఈ జాబితాలో భారత్ నుంచి పూర్ణిమా దేవి బర్మన్ (45) ఒక్కరే చోటు దక్కించుకున్నారు. అస్సాంకు చెందిన ఈమె 18 ఏళ్లుగా Greater Adjutant అనే జాతి కొంగల సంరక్షణకు కృషి చేస్తున్నారు. అంతరించిపోయే దశ నుంచి ప్రస్తుతం వాటి సంఖ్య 1800 దాటింది.