యూట్యూబర్ లోకల్ బాయ్ నాని చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం సీరియస్ అయ్యారు. 'డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ తాము ఏం చేసిన నడుస్తుందనే భ్రమలో ఉండకండి. చట్టప్రకారం మీకు శిక్షలు తప్పవని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లను ఆపండి.' అని సజ్జనార్ హితవు పలికారు.