కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్‌లు వారధిగా వ్యవహరించాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన గవర్నర్ల సదస్సులో భాగంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. సామన్య ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సామాజిక సంస్థలతో సంప్రదింపులు జరపాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అధ్యక్షతన ఢిల్లీలో రెండు రోజులపాటు ఈ గవర్నర్ల సదస్సు జరగనుంది.