బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానం: కేటీఆర్‌

65చూసినవారు
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానం: కేటీఆర్‌
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రచారంలో ప్రతిగింజకూ బోనస్‌ అని ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అంటారా? అని ప్రశ్నించారు. నీరివ్వరు.. కరెంట్‌ ఇవ్వరు.. పంట కూడా సరిగా కొనుగోలు చేయరా? అని నిలదీశారు. నమ్మి ఓట్లేస్తే గొంతు కోస్తున్నారని, ఆ పార్టీది ఓట్ల నాడు ఓ ముచ్చట.. నాట్లనాడు ఓ ముచ్చట అని ఎద్దేవా చేశారు. బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయట పెట్టారన్నారు.

సంబంధిత పోస్ట్