పండుగల సమయంలో విమాన ఛార్జీల పెరుగుదలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది: విమానయాన మంత్రి

62చూసినవారు
పండుగల సమయంలో విమాన ఛార్జీల పెరుగుదలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది: విమానయాన మంత్రి
పండుగ సీజన్‌లో, డిమాండ్ పెరిగే సమయంలో ప్రయాణికులను దోపిడీ చేయవద్దని ఎయిర్ ఆపరేటర్లను కోరుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం పేర్కొన్నారు. తమ మంత్రిత్వ శాఖ ప్రతిరోజూ విమాన ఛార్జీలను పర్యవేక్షిస్తోందని మంత్రి రామ్మోహన్ చెప్పారు. విమాన చార్జీల నియంత్రణకు మంత్రిత్వ శాఖ తరపు నుంచి అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్