తెలంగాణ మొత్తాన్ని కుదువ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని.. 'కాళేశ్వరం' లేకున్నా తెలంగాణలో తమ హయాంలో రికార్డ్ స్థాయిలో ధాన్యం పండిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టులు నిర్మించగపోగా, పాలమూరును ఎడారి చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ వడ్డీ పెరిగిపోయిందని.. ఇచ్చిన మాట ప్రకారం 15 రోజుల్లోనే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. శనివారం మహబూబ్ నగర్ భహిరంగ సభలో భట్టి ప్రసంగించి మాట్లాడారు.