బామ్మ 105వ బర్త్ డే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన కుటుంబసభ్యులు

76చూసినవారు
కన్న తల్లిదండ్రులనే పిల్లలు భారంగా భావిస్తున్న రోజులివి. అలాంటిది 105 ఏళ్ల బామ్మ పుట్టిన రోజును కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహించి.. సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమిళనాడులోని మామల్లపురానికి చెందిన కన్నమ్మ ఐదు తరాలను చూసింది. 65 మంది కుమార్తెలు, మనవళ్లు, ముని మనవళ్లంతా బాణా సంచా కాలుస్తూ, నృత్యం చేస్తూ.. ఆమెను పల్లకిపై గ్రామంలో ఊరేగించారు. అనంతరం బహుమతులు ఇచ్చి, పుట్టిన రోజు కేకును కోశారు.

సంబంధిత పోస్ట్