గ్రేట్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీస్

64చూసినవారు
ఓ పోలీస్ అధికారి చేసిన పనికి నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఓ కోతికి సీపీఆర్ చేసి ప్రాణం పోశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులందహర్‌లో జరిగింది. ఓ కోతి వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిపడిపోగా అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ వికాస్ దాని ఛాతిపై నొక్కుతూ సీపీఆర్ చేశాడు. ఈ క్రమంలో దానికి కొద్దిగా నీళ్లు తాగించి, కోతి శరీరాన్ని చల్లబరిచాడు. దాంతో ఆ కోతి తెరుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్