మరో రికార్డు సృష్టించిన హనుమాన్ మూవీ

6453చూసినవారు
మరో రికార్డు సృష్టించిన హనుమాన్ మూవీ
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం 'హనుమాన్'. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ మొదటి రోజు నుంచే రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా మరో రికార్డు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సినిమాను కోటి మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. కాగా, సౌత్ ఇండియా నుంచి బహుబలి, బహుబలి-2, కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్, రోబో 2.0, ఇండియన్, యానిమల్ తదితర చిత్రాలు 3 కోట్లకు పైగా ఫుట్ ఫాల్స్‌ను సాధించాయి.

సంబంధిత పోస్ట్