కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్

77చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలను ఆ పార్టీ బెదిరించి, భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ దాడులతో వేధిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒత్తిడికి గురి చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరుగుతూ అధికార పార్టీ బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్