హరీశ్ రావు చిల్లర రాజకీయాలు: మంత్రి ఉత్తమ్

68చూసినవారు
హరీశ్ రావు చిల్లర రాజకీయాలు: మంత్రి ఉత్తమ్
TG: కృష్ణ ట్రిబ్యునల్ అంశంపై హరీశ్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నీళ్ల వ్యవహారాల్లో కేసీఆర్, హరీశ్ రావు లిఖితపూర్వకంగా సంతకాలు పెట్టారని మండిపడ్డారు. పోతిరెడ్డి పాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కళ్లు మూసుకుని ఉన్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో కృష్ణా జలాల నీటి వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్