HDFC ఫిక్స్‌డ్ డిపాజిట్లు వడ్డీరేట్లు పెంపు

56చూసినవారు
HDFC ఫిక్స్‌డ్ డిపాజిట్లు వడ్డీరేట్లు పెంపు
HDFC తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. కొన్ని కాలపరిమితులతో కూడిన రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్ల రేట్లను సవరించింది. వీటిపై 20 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపింది. పెంపు తర్వాత HDFC బ్యాంక్ తమ ఎఫ్‌డీ ఖాతాదారుల్లో సాధారణ పౌరులకు గరిష్ఠంగా 7.40 శాతం, సీనియర్ సిటిజెన్స్‌కు 7.90 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్