ఒలింపిక్స్ కోసం వేలు తొలగించుకున్నాడు

77చూసినవారు
ఒలింపిక్స్ కోసం వేలు తొలగించుకున్నాడు
పారిస్ ఒలింపిక్స్‌లో దేశం కోసం ఆడాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా హాకీ ప్లేయర్ మాట్ డాసన్ వేలు త్యాగం చేశారు. ఇటీవల అతడి కుడి చేతి ఉంగరపు వేలు విరిగింది. ఎముక సెట్ అయ్యే సరికి సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో డాక్టర్ల సాయంతో ఆ వేలు పైభాగాన్ని తొలగించుకున్నారు. అతడి పట్టుదలపై కోచ్, తోటి ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడు గత టోక్యో ఒలింపిక్స్‌లో తన దేశానికి రజత పతకం సాధించడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్