బైక్‌పై స్పీడుగా వెళ్లాడు.. చివరికి (వీడియో)

71చూసినవారు
స్పోర్ట్స్ బైక్ నడిపేటప్పుడు చాలా మంది బైకర్లు వేగంగా ప్రయాణించడాన్ని ఇష్టపడతారు. ఇదే కోవలో గోవాలోని పోర్వోరిమ్ ప్రాంతంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి షోరూమ్‌కు వెళ్లి స్పోర్ట్స్ బైక్ కొనేందుకు ఆసక్తి చూపాడు. అనంతరం టెస్ట్ రైడ్ కోసం ఆ బైక్ తీసుకుని వేగంగా దూసుకెళ్లాడు. ఎదురుగా స్కూటర్‌పై వస్తున్న మహిళను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్‌తో పాటు ఆ మహిళకు కూడా గాయాలయ్యాయి. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :