పచ్చిమిర్చి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సీ, బీటా కెరోటిన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి మేలు చేస్తాయి. పచ్చిమిర్చి ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్త ప్రసరణను వేగవంతం చేసి అలసటను తగ్గిస్తుంది. పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సెసిన్ అనే సమ్మేళనం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. శారీరక దృఢత్వానికి, చర్మ సౌందర్యానికి పచ్చిమిర్చి ఎంతగానో ఉపయోగపడుతుంది.